హీరోయిన్ గా నిలబడటం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ బాలీవుడ్లో హీరోయిన్ గా ఎదగడానికి అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. చాలా మంది సౌత్ హీరోయిన్ల మెయిన్ టార్గెట్ బాలీవుడ్లో స్థిరపడటమే. వాస్తవానికి నార్త్ అమ్మాయిలే సినిమాల్లోకి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ఒకవేళ వాళ్ళ టైం బాగుండి హీరోయిన్ గా స్థిరపడితే మాత్రం.. తర్వాత ఎక్కువ సక్సెస్..లు కొట్టి వాళ్ళ హోమ్ టౌన్ కి అదే బాలీవుడ్ కి చెక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్లో సక్సెస్ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లకి మొదటి ఛాన్సులు ఇవ్వడంలో మాత్రం హిందీ ఫిలిం మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అది వేరే విషయం.
అయితే సౌత్ నుండి నార్త్ కి వెళ్లి స్టార్ హీరోయిన్ గా స్థిరపడిన వాళ్లలో ఐశ్వర్య రాయ్ ఒకరు. నార్త్ అమ్మాయిలనే డామినేట్ చేసేసి.. అందగత్తె అంటే ముందుగా ఈమె పేరే చెప్పుకునేంతలా ఎదిగింది ఐశ్వర్య రాయ్. అయితే ఒకానొక టైంలో ఐశ్వర్య రాయ్ అందాన్ని సవాలు చేసింది బర్ఖా మధన్. ఈమె గురించి నేటి తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు బర్ఖా మధన్ మిస్ ఇండియా అందాల పోటీల్లో సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వంటి అందగత్తెలతో ర్యాంప్ వాక్ చేసింది. 1994లో.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఈమె మిస్ టూరిజం టైటిల్ ను కూడా గెలుచుకుంది.
తర్వాత మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో 3వ స్థానాన్ని సంపాదించుకుని సంచలనం సృష్టించింది. ‘ఖిలాడియోం క ఖిలాడి’ సినిమాలో ఈమె ముఖ్య పాత్ర పోషించింది. తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘భూత్’ లో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే ‘న్యాయ్’ ‘1857 క్రాంతి’ వంటి హిందీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే సినిమాల్లో బోలెడన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ.. వాటన్నిటినీ వదిలేసి సన్యాసిగా మారిపోయింది. రెడ్ కార్పెట్ పై నడవాల్సిన బర్ఖా ఇప్పుడు హిమాలయాల్లో బండ రాళ్లపై నడుస్తూ శారీరిక శ్రమ ఎదురవుతున్నప్పటికీ మానసిక సంతోషం పొందుతుంది.