పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు

విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న సంప్రదాయాల్లో సహజీవనం ఒకటి. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారు దీనిని పూర్తిగా వ్యతిరేకించినా, ఉన్నత చదువులు అభ్యసించిన వారు, సమాజంలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీలు ఈ కల్చర్ ని ఫాలో అవుతుంటారు. సినీ రంగంలో కూడా సహజీవనం చేసేవారు కొంతమంది ఉన్నారు. ఇద్దరికీ బేధాభిప్రాయాలు రానంతవరకు కలిసి ఉండి, ఆతర్వాత విడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డేటింగ్ లో ఉన్న అమ్మాయి తల్లి అయితే ఆలోచనలో మార్పు వస్తోంది. బిడ్డ బాగుకోసం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అలా తల్లిదండ్రులు అయిన తర్వాత భార్య భర్తలు అయిన వారిపై ఫోకస్.

1. శ్రీదేవి – బోనీకపూర్బాల నటిగా చిత్ర సీమలో అడుగుపెట్టి అతిలోక సుందరిగా పేరుగాంచిన నటి శ్రీదేవి. ఈమెను ప్రేమించిన వారిలో సాధారణ అభిమానులతో పాటు బడా హీరోలు సైతం ఉన్నారు. అయితే శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని హఠాత్తుగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. వీరి పెళ్లి అయిన రెండు నెలలకు తెలిసిన సంగతి ఏమిటంటే.. పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్భిణీ అంట. ప్రెగ్నెసీ కి కారణమయిన బోనీనే పెళ్లి చేసుకుంది.

2. రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లిచేసుకున్న తొలి భార్య నుంచి విడిపోవడంతో తర్వాత పెళ్లి చేసుకోదలుచుకోలేదు. బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అప్పుడు తల్లి దండ్రులు అయిన వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు.

3. సారిక – కమల్ హాసన్విశ్వనటుడు కమలహాసన్ కి డ్యాన్సర్ తో పెళ్లిఅయినప్పటికీ బాలీవుడ్ నటి సారిక ప్రేమలో పడ్డారు. దీంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికతో సహజీవనం సాగించారు. అప్పుడే సారిక నెలలు తప్పింది. బిడ్డ కోసం పెళ్లి చేసుకున్నారు. అంటే శృతిహాసన్ కడుపులో పడిన తర్వాత సారిక, కమల్ భార్య భర్తలు అయ్యారన్నమాట.

4. సెలీనా జెట్లీ – పీటర్బాలీవుడ్ పిల్లి కళ్ల సుందరి సెలీనా జెట్లీ కూడా పెళ్లి కాక ముందే తల్లి అయింది. ఆస్ట్రేలియాకు చెందిన బిజినెస్ మ్యాన్ పీటర్ తో చాలాకాలంగా సహజీవనం చేసింది. ఆ సమయంలో ప్రెగ్నెసి కావడంతో తల్లిగా అలోచించి మనసు పంచుకున్న పీటర్ తో జీవితం సాగించేందుకు వివాహం చేసుకుంది.

5. వీణా మాలిక్ – అసద్ బషీర్ ఖాన్పాకిస్థానీ నటి వీణా మాలిక్ పెళ్లికాక ముందే తల్లి అయింది. బిగ్ బాస్ షో సీజన్ 4 లో హాట్ హాట్ గా కనిపించిన ఈ భామ 2002 నుంచి వ్యాపార వేత్త అసద్ బషీర్ ఖాన్ తో స్నేహం చేసింది. 2005 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus