గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం: ప్రముఖ యువ హీరోయిన్ ఆదాశర్మ

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిరంతర ప్రవాహినిలా సాగుతుంది. శ్రీరంగం నుంచి శ్రీనగర్ దాక పచ్చదనాన్ని పరుస్తుంది. వేళ్లు వేర్లను నేలకు పరిచేయం చేస్తూ.. హృదయాలు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యతల్ని వంతుల వారిగా పంచుకుంటున్నాయి. ఇప్పుడు దేశమంతా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక ట్రెండ్. పచ్చదనాన్ని ప్రేమించే మనుషుల ట్రెండ్. ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో ఈ రోజు సిల్వర్ స్క్రీన్ సిల్క్ పోగు, తన అందంతో యువతకు “సహార్ట్ ఎటాక్” లు తెప్పించిన బ్యూటీబ్రాండ్ ‘ఆదాశర్మ’. క్వశ్చన్ మార్క్(?) సినిమా నిర్మాత గౌరీ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ముంబై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఆదాశర్మ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

ఇంత నిస్వార్ధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనది అని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటలని కోరారు. ముఖ్యంగా తన అభిమానులు అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus