ఎన్నో చోట్ల క్యాస్టింగ్ కౌచ్ ఉంది – ఆదా శర్మ

తెలుగు పరిశ్రమని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. రూమర్లకు, ఆరోపణలకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య మహమ్మారిగా మారిపోయి టాలీవుడ్ పరువుని బజారుకి ఈడుస్తోంది. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొంతమంది నెగటివ్ గా మాట్లాడుతున్నారు. రీసెంట్ హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆమె వెల్లడించింది. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని చెప్పింది.

పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వెనుకాడటం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని… ఎన్నో చోట్ల ఇది కొనసాగుతోందని వివరించింది. కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని తెలిపింది. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో తనకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. టాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే… అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయని పేర్కొంది. బాలీవుడ్ తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం చాలా సులభమని ఆదా శర్మ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus