కాస్త లేట్ అవ్వోచ్చు కానీ.. సీక్వెల్ పక్కా!

జూనియర్ ఎన్టీయార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా మాత్రమే కాక ఎన్టీయార్ ను మోస్ట్ వెర్సటైల్ గా ప్రెజంట్ చేసిన సినిమాగా “అదుర్స్” చిత్రాన్ని చెప్పుకోవచ్చు. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010లో విడుదలై ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్టీయార్ ద్విపాత్రాభినయం పోషించడంతోపాటు.. బ్రాహ్మణ యాసలో పలికిన సంభాషణలు, పండించిన కామెడీ చిత్ర విజయంలో కీలకపాత్రలు పోషించాయి. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనే దర్శకుడు వినాయక్ “అదుర్స్ 2” తీస్తాను అని ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ విషయాన్ని మొదట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. వినాయక్ ఆ మాటను ఒకటికి రెండుసార్లు చెప్పడంతో ఎన్టీయార్ అభిమానులు ఆ సీక్వెల్ పై ఆశలు పెంచుకోవడం మొదలెట్టారు.

కట్ చేస్తే.. “అదుర్స్” విడుదలై 7 ఏళ్ళు కావస్తున్నా సీక్వెల్ పై మాటలు తప్పితే చేతలు కరువయ్యాయి. దాంతో.. అభిమానులు కూడా ఆ సీక్వెల్ విషయాన్ని మర్చిపోయారు. కానీ.. వినాయక్ మళ్ళీ “అదుర్స్ 2” త్వరలోనే మొదలవుతుంది, కాస్త లేట్ అవ్వోచ్చు కానీ సీక్వెల్ రావడం మాత్రం పక్కా అని బల్ల గుద్ది మరీ చెప్పాడు. దాంతో మళ్ళీ “అదుర్స్ 2” వెలుగులోకి వచ్చింది.

మరి “అదుర్స్ 2” సెట్స్ కు వెళ్ళే వరకూ ఏం చెప్పలేం కానీ.. ఎన్టీయార్ ఫ్యాన్స్ మాత్రం హీరోయిన్స్ ఎవరుంటారు, మళ్ళీ ఎన్టీయార్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తాడా? లేదా? అనే విషయాలు చాలా సీరియస్ గా చర్చించుకొంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus