Adi Reddy: వీడియో కాల్ లో ఆదిరెడ్డి మిసెస్ ఇచ్చిన హింట్ ఏంటి ? ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ తర్వాత ఎమోషనల్ టాస్క్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్ బ్యాటరీఛార్జింగ్ ని 100 శాతం నుంచీ హౌస్ మేట్స్ వినియోగించుకునేందుకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చిన శ్రీహాన్ కోసం ఇంట్లో నుంచీ ఫుడ్ తినాలంటే 15శాతం బ్యాటరీ, ఆడియోకాల్ మాట్లాడాలి అంటే 30శాతం బ్యాటరీ, అలాగే శ్రీహాన్ వాళ్ల నాన్నగారితో మాట్లాడాలంటే 35శాతం బ్యాటరీ వాడాలని కండీషన్ పెట్టాడు. కంపల్సరీగా ఏదో ఒక ఆఫ్షన్ హౌస్ మేట్స్ తీస్కోవాల్సి వచ్చింది. దీంతో శ్రీహాన్ ఇంట్లో వండిన మటన్ బిర్యానీ తీస్కుంటానని 15శాతం బ్యాటరీ వాడాడు.

ఆ తర్వాత సుదీప వంతు వచ్చింది. సుదీప కూడా చేసేదేమీ లేక 35శాతం బ్యాటరీతో ఆమె భర్త రంగనాధ్ తో ఆడియో కాల్ మాట్లాడింది. ఆ తర్వాత వచ్చిన ఆదిరెడ్డికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. 35, 40, 45శాతం బ్యాటరీ వాడాలని చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి 45శాతం బ్యాటరీ వాడి వీడియోకాల్ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఇక్కడ్నుంచే అసలు సిసలైన డ్రామా మొదలైంది. ఎప్పుడెప్పుడు వీడియోకాల్ వస్తుందా అని హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో ఆదిరెడ్డి వైఫ్ కవిత ప్లాస్మా టీవిలో దర్శనమిచ్చింది. తన పాపని, భార్యని చూడగానే చాలా సంబరపడిపోయాడు ఆదిరెడ్డి.

ఇక్కడ ఆదిరెడ్డి వైఫ్ కవిత పాపతో పాటుగా ఒక టెడ్డీబేర్ ని పట్టుకుంది. ఆదిరెడ్డితో మాట్లాడేటపుడు సడెన్ గా ఒక చేయి వచ్చి గ్రీన్ కలర్ బాల్ ని ఇచ్చారు. ఈ బాల్ ఫ్రేమ్ లోకి అడ్డంగా వస్తే దాన్ని చాలా క్యాజువల్ గా తీస్కుని తన దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవారం బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి , గ్రీన్ కలర్ అనేది సేవ్ చేయడానికి హౌస్ లో వాడతారు కాబట్టి ఇది ఒక హింట్ లా ఆదిరెడ్డికి అర్ధమైంది. కావాలనే ఇలా ముందుగానే ప్లాన్ చేస్కుని ఉంటారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి వీడియోకాల్ మాట్లాడేటపుడు బిగ్ బాస్ టీమ్ చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ, సడెన్ గా ఇలా చేసేసరికి ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత పాపని పక్కనిపెట్టి ఈ బాల్ ని చేతిలో తీస్కుని మాట్లాడుతూ హింట్ ఇచ్చింది ఆదిరెడ్డి వైఫ్ కవిత. ఇంకో మేటర్ ఏంటంటే.?

ఇక వీడియోకాల్ మాట్లాడేటపుడు నా ఆటని మార్చుకోవాలా ? నిీ వైపు తప్పులేనపుడు అస్సలు తగ్గదని, స్టాండ్ గట్టిగా తీస్కోమని మరీ మరీ చెప్పింది. అంటే, ఆటని ఎగ్రెసివ్ గా ఆడమని అలా ఆడితేనే నచ్చుతున్నావని చెప్పింది. బయట నీ డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పింది. ఇప్పటికే చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతున్న రివ్యూవర్ ఆదిరెడ్డి ఇప్పుడు తన వైఫ్ ఇచ్చిన ఈ హింట్ తో రెచ్చిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. వీడియోకాల్ మాట్లాడిన తర్వాత రాత్రి స్మిమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఆది తనలో తాను మాట్లాడుకున్నాడు. నేను ఎక్కడ్నుంచీ వచ్చాను ? అసలు ఈ రేంజ్ ఏంటి తలుచుకుంటేనే ఏదోలా ఉంటది బిగ్బాస్, థ్యాంక్యూ అంటూ బిగ్ బాస్ కి ధన్యవాదాలు చెప్పాడు. మరి రానున్న వారాల్లో తన గేమ్ ఎలా మారుస్తాడు అనేది చూడాలి.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus