Adipurush: ఆ నెగిటివ్ కామెంట్లకు చెక్ పెట్టే విధంగా ఆదిపురుష్.. అవే ప్లస్ అంటూ?

ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ సైతం సంతోషించడంతో పాటు ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని భావిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభం కానుండగా మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. టికెట్ రేట్ల పెంపు వల్లే బుకింగ్స్ ఆలస్యం అయ్యాయని మేకర్స్ వెల్లడించడం గమనార్హం. అయితే ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు కొదువే లేదని తెలుస్తోంది.

ముంబై మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్వల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం. రాఘవ పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నారని తెలుస్తోంది. సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం అందుతోంది. రావణుని పాత్రకు సైఫ్ అలీ ఖాన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని సమాచారం అందుతోంది. త్రీడీలో ఈ సినిమాను చూసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హనుమంతుడు లంకను దహనం చేసే సీన్ ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. వాలి సుగ్రీవుల ఎపిసోడ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని బోగట్టా. శూర్పణఖ ముక్కు కోసే సీన్ కూడా అద్భుతంగా ఉండనుందని సమాచారం. జీఎస్టీతో కలిపి ఆదిపురుష్ (Adipurush) తెలుగు రాష్ట్రాల హక్కులు 185 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ తో సినిమాలను నిర్మించడంతో పాటు ప్రభాస్ సినిమాల హక్కులను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల నిర్మాణం దిశగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడుగులు వేస్తోంది. ఈ బ్యానర్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు ఈ బ్యానర్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus