Adipurush: ప్రభాస్ డైరెక్టర్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత!

బాలీవుడ్ లో ‘తాన్హాజీ’ సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు ఓం రౌత్.. ఇప్పుడు ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమా తీశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టీజర్ పై విమర్శలు వచ్చాయి. యానిమేటెడ్ సినిమా అంటూ ట్రోల్ చేశారు.

దర్శకుడు ఓం రౌత్ ను కూడా టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ట్రోలింగ్ జరిగింది. అయితే నిర్మాత మాత్రం ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే.. రూ.4 కోట్ల విలువైనా కారుని ఓం రౌత్ కి బహుమతిగా ఇచ్చారు. ‘ఆదిపురుష్’ చిత్ర నిర్మాతలలో ఒకరైన టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఫెరారీ ఎఫ్8 కారుని ఓం రౌత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. దాని ఖరీదు దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అయితే అది కొత్త కారు కాదని టాక్. ఇంతకముందు భూషణ్ కుమార్ కొనుక్కున్న కారుని.. ఓం రౌత్ వర్క్ చూసి అతడికి ఇచ్చినట్లు ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. భూషణ్ కుమార్ ఇదివరకు కూడా ఇలా తనతో సినిమాలు చేసిన వాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. ఆయన నిర్మించిన ‘భూల్ భులయ్యా 2’ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ సినిమాలో హీరో కార్తీక్ ఆర్యన్ కు రూ.4.70 కోట్లు ఖరీదు చేసే మెక్ లారెన్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ‘ఆదిపురుష్’ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus