Aditi Rao Hydari: వేరే హీరోకి ప్రపోజ్ చేసి సిద్దార్థ్ కు షాక్ ఇచ్చిన అధితి.. సిద్ధార్థ్ రియాక్షన్ ఏంటంటే?

  • February 15, 2023 / 01:43 PM IST

నిన్న వాలెంటైన్స్ డే కావడంతో ప్రపంచమంతా ఈ రోజును ప్రత్యేకంగా భావించి సెలబ్రేట్ చేసుకుంది. ప్రేమ పక్షులన్నీ ఓ చోటకి చేరి రొమాన్స్ చేసుకోవడం, మరోపక్క ప్రేమలో ఉన్న వారు తమ లవ్ కు ప్రపోజ్ చేయడం వంటివి చేస్తే..! సింగిల్స్ మాత్రం వాలెంటైన్స్ డే ని తిట్టి పోస్తూ, రకరకాల మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే వాలెంటైన్స్ డే ని సెలబ్రిటీలు కూడా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

అందులో అదితీరావ్ హైదరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమెకు ఇది వరకే పెళ్లయింది. విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. కొన్నేళ్లుగా సింగిల్ గా ఉన్న ఈమె ‘మహాసముద్రం’ షూటింగ్ టైంలో హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది.అతను కూడా గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని ఖాళీగా ఉన్నవాడే..! వీళ్ళు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీళ్ళు కూడా పలు సందర్భాల్లో మీడియా కంట పడ్డారు.

అయితే నిన్న వాలెంటైన్స్ డే రోజున సిద్దార్థ్ కు కాకుండా అధితి వేరే హీరోకి ప్రపోజ్ చేయడం అందరికీ షాకిచ్చింది. అదితి ప్రపోజ్ చేసింది సీనియర్ నటుడు ధర్మేంద్రకి.! ఆయనకు ఓ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వీడియోను తన ఇన్ స్టా స్టేటస్ లో పెట్టింది అతిథి. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

‘మై సరియల్ వాలెంటైన్స్ డే… ది మోస్టస్ట్ హ్యాండ్సమ్’ అంటూ రాసుకొచ్చి ధర్మేంద్రని ట్యాగ్ చేసింది. దీనికి సిద్దార్థ్ కూడా లవ్ సింబల్ షేర్ చేసి రిప్లై ఇచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం సిద్దార్థ్ ను మోసం చేశావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus