Aditya 999: ఆదిత్య 999.. యువ హీరోలను కూడా లాగుతున్నారా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రాల్లో ఆదిత్య 369 ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం అప్పట్లో సరికొత్త కథనంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. బాలయ్య కెరీర్‌లో బిగ్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 నిర్మాణం జరుగుతుందని గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలయ్య స్వయంగా ఆదిత్య 999 (Aditya 999) కథను రాస్తున్నట్లు ప్రకటించారు.

Aditya 999

కానీ వరుస సినిమాల షెడ్యూల్ కారణంగా స్క్రిప్ట్ పూర్తి చేయలేకపోయారు. ఇక లేటెస్ట్ గా కొంతమంది రచయితలతో వర్క్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా బాలయ్య భారీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా, ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా రూపొందించాలని బాలయ్య భావిస్తున్నట్లు టాక్. ఇందులో బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞను పరిచయం చేయడమే కాకుండా, న్యూయేజ్ యాక్టర్స్ అయిన విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డలను (Siddu Jonnalagadda)  కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

సిద్ధు, విశ్వక్ సేన్ ఇద్దరూ బాలయ్యకు అభిమానులు. వారు బాలయ్య పక్కన దాదాపు ప్రతి ఈవెంట్‌లో కనిపిస్తారు. ఈ ఇద్దరు యాక్టర్లు మోక్షజ్ఞతో (Nandamuri Mokshagnya Teja) స్క్రీన్ షేర్ చేసుకుంటే, ఆదిత్య 999 మరింత వెరైటీగా, పాన్ ఇండియా రేంజ్‌లో నిలుస్తుందని భావిస్తున్నారు. విశ్వక్, సిద్ధు ఇద్దరూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన హీరోలు కావడంతో, వారి భాగస్వామ్యం సినిమా మార్కెట్‌ను విస్తరించే అవకాశాలు ఉన్నట్లు నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. మల్టీస్టారర్‌గా రూపొందే ఈ సినిమా కేవలం కథలోనే కాదు, విజువల్స్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నారు. భారీ బడ్జెట్‌తో నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి బాలయ్య ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus