Adivi Sesh,Mahesh Babu: కృష్ణ మరణం తర్వాత మహేష్ అలా చేస్తున్నారా?

సాధారణంగా మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. తండ్రి మరణం తర్వాత మహేష్ బాబు ఎంతో బాధ పడుతున్నారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ బాబును ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబుకు సన్నిహితులైన వ్యక్తులలో అడివి శేష్ ఒకరు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమాకు మహేష్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే. హిట్2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ మాట్లాడుతూ

కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు చాలా బాధ పడుతున్నారని ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. నమ్రత గారిని అడిగి మహేష్ పరిస్థితిని తెలుసుకున్నానని అడివి శేష్ అన్నారు. మహేష్ బాబు లాంటి బాధ ఎవరికీ రాకూడదని అడివి శేష్ పేర్కొన్నారు. దేవుడు మహేష్ కు మానసిక ధైర్యం అందించాలని అడివి శేష్ కామెంట్ చేశారు. ఫోన్ కాల్స్ కు కూడా మహేష్ అందుబాటులో ఉండటం లేదని ఫోన్ కాల్స్ చేసినా ఆ కాల్స్ ను లిఫ్ట్ చేయడానికి మహేష్ ఇష్టపడటం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అడివి శేష్ చెప్పిన విషయాలు విని ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. మహేష్ త్వరగా ఈ బాధ నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటించనున్నారని తెలుస్తోంది.

త్వరలో మహేష్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉండగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. పూజా హెగ్డే రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus