ఒకటి కాదు….రెండు కాదు….అక్షరాల 33ఏళ్లు అన్నగారు ‘తెలుగుదేశం’ పేరుతో డిల్లీ నడివీదుల్లో తాకట్టు పెట్టిన తెలుగు ఆత్మ గౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారు. మళ్లీ అదే కోపం, అదే కసి, అదే రోషంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తు, నిరసిస్తూ పవన్ కల్యాణ్ తిరుపతిలో సభను ఏర్పాటు చేసి కేంద్రాన్ని విమర్శించారు. అదే క్రమంలో ఆయన మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తమ హక్కు అని, ఆది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని తెలిపాడు.
మూడు రాష్టాల ముఖ్యమంత్రులు అడ్డు పడుతూ ఉన్నారు అని అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం అంటూ చెబుతున్న ప్రభుత్వం అప్పుడు విభజన సమయంలో 6కోట్ల మందిని ఎలా మరచిపోయారు అని ఆయన ప్రశ్నించారు. కొంగ్రెస్ పార్టీ చేసిన తప్పే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అని, అదే క్రమంలో కొంగ్రెస్ హయాంలో ఆ పార్టీ ఎంపీలు ఎలా అయితే మేడమ్ అంటూ సోనియా గాంధీని రిక్వెస్ట్ చేసేవారో, అదే రకంగా ఇప్పుడు ఎంపీలు సైతం సార్…సార్ అంటూ మోడిని పిలవడంతోనే సరిపోతుంది కానీ, పౌరుషంతో, బానిసలుగా కాకుండా పోరాటాన్ని కొనసాగించాలి అని పవన్ పిలుపునిచ్చాడు.
పవన్ మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఆయన మాట్లాడిన మాటల్లో అర్ధం లేకపోలేదు, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న వర్తమాన రాజకీయాల్లో పవన్ ఎంచుకున్న నినాదం వర్కౌట్ అవడానికి చాలా తక్కువ చాన్సస్ ఉన్నాయి అనే చెప్పాలి. ఏది ఏమైనా పవన్ గర్జన మొదలు పెట్టాడు. అది ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.