మరోసారి నాగ చైతన్యతో పూజా హెగ్డే రొమాన్స్..!

  • February 8, 2021 / 08:54 PM IST

2014 అక్టోబర్ 17న విడుదలైన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది పూజా హెగ్డే. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. దీని తరువాత చైతన్య, పూజ లు మళ్ళీ కలిసి నటించలేదు. ఇప్పుడు పూజా హెగ్డే అయితే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇలాంటి టైంలో నాగ చైతన్యతో కలిసి నటిస్తుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం.. చైతన్యతో మళ్ళీ జోడి కట్టనుందట పూజా హెగ్డే. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రం చెయ్యబోతున్నాడు నాగ చైతన్య. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైనట్టు సమాచారం.అందుకోసం భారీగా పారితోషికం కూడా అందుకోబోతుందని తెలుస్తుంది.

అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం పూజ.. రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అందుకు దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పేసారట. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. అంతేకాదు మహేష్ బాబు వీరాభిమానిగా.. అతని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఈ చిత్రంలో చైతన్య పాత్ర ఉండబోతుందట.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus