ఆమిర్ పనైపోయింది.. నెక్స్ట్ టార్గెట్ షారుఖ్, హృతిక్… లేనా?

  • August 16, 2022 / 04:06 PM IST

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ‘#BoycottLaalSinghChaddha’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేసి ఆ సినిమాని ఎవ్వరూ చూడకుండా చేశారు నార్త్ జనాలు. ఇందుకు కారణాలు లేకపోలేదు.2015 లో ఇండియాలో అస‌హ‌నం ఉందంటూ ఆమిర్ ఖాన్ కామెంట్లు చేశాడు. అలాగే తన ‘పీకే’ సినిమా ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీసాడు అంటూ ఆమిర్ పై ప్రతీకారంగా అక్కడి జనాలు ఇలా చేశారు.

దానికి తోడు ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో సినిమాని పాతాళంలోకి తొక్కేసినట్టు స్పష్టమవుతుంది.ఏకంగా 1300 షోలు క్యాన్సిల్ అయ్యాయి అంటే #BoycottLaalSinghChaddha హ్యాష్ ట్యాగ్ ప్రభావం సినిమా రిజల్ట్ పై ఏ రేంజ్లో పడిందో అర్థం చేసుకోవచ్చు.ఎలాగూ ఆమిర్ పని అయిపోయింది ఇప్పుడు నెటిజన్ల నెక్స్ట్ టార్గెట్ హ్రితిక్, షారుఖ్ ఖాన్లు అని తెలుస్తుంది. హృతిక్ రోషన్ నటించిన ‘#BoycottVikramVedha అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇప్పుడు వైరల్ అవుతుంది.

బ్యాన్ చేసేంతలా హృతిక్ ఏం చేశాడు అనే అనుమానం మీకు రావచ్చు..! ఏమీ లేదు.. ఆమిర్‌ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా చూసి పాజిటివ్‌గా ట్వీట్ వేసాడు. ఈ సినిమా చాలా బాగుందని.. ఇలాంటి చిత్రాన్ని అస్సలు మిస్ కాకూడదని హృతిక్ పేర్కొన్నాడు.ఆ ట్వీటే ఇప్పుడు ‌హృతిక్ రోషన్‌‌ని వివాదంలోకి నెట్టినట్టు అయ్యింది. మరోపక్క షారుఖ్ ఖాన్ సినిమా పై కూడా నార్త్ జనాలు పగబట్టారు. #BoycottPathaan హ్యాష్ ట్యాగ్ ను కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మూవీ 25 జనవరి 2023 న విడుదల కావాల్సి ఉంది. విడుదలకు ఇంకా 5 నెలల టైం ఉండగానే #BoycottPathaan అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.దీనికి కూడా కారణాలు ఉన్నాయి.ఈ మధ్యనే షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో ఎయిర్ పోర్ట్ లో ఉన్నప్పుడు ఓ అభిమాని సెల్ఫీ అంటూ షారుఖ్ వద్దకు వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. ఇది ఫారూఖ్ కు న‌చ్చ‌లేదు. దీంతో ఆ అభిమాని పై విరుచుకుపడ్డాడు షారుఖ్. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు.

కానీ ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.గతంలో జనవరి 2020లో, ఢిల్లీలో తన ‘ఛపాక్‌’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు దీపిక JNU కి వెళ్ళింది.ఆ టైంలో అక్క‌డ నిర‌స‌న చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపింది. ఇది బీజేపీ అనుకూల వాదుల‌కు నచ్చలేదు. అందుకే #BoycottChhapaak అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీపిక నటిస్తున్న పఠాన్‌ సినిమా పై పడ్డారని స్పష్టమవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus