చిన్న సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడూ భావిస్తారు. అయితే చిన్న సినిమాలు ఆ రేంజ్ లో సక్సెస్ సాదించడం అరుదుగా జరుగుతుంది. అయితే హనుమాన్ సినిమా మాత్రం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి పెద్ద సినిమాల స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. మరో విధంగా చెప్పాలంటే పెద్ద సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. అప్పట్లో పెద్ద సినిమాలలో బాహుబలి2 ఏ స్థాయిలో సంచలనాలను సృష్టించిందో ఇప్పుడు చిన్న సినిమాలలో హనుమాన్ అదే స్థాయిలో సంచలనాలను సృష్టిస్తోంది.
హనుమాన్ సినిమాకు ఇప్పటికే కలెక్షన్లు 250 కోట్ల రూపాయలు దాటాయి. ఈ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు కాగా ఈ సినిమా షేర్ కలెక్షన్లు 120 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి. నగరాలలో బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా టైర్2, టైర్3 సినిమాలలో మాత్రం బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం పెద్ద హీరోలకే ఎంతో కష్టం కాగా హనుమాన్ అద్భుతమైన కథ, కథనం వల్లే అంచనాలను మించి హిట్ గా నిలిచింది.
హనుమాన్ ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఇమేజ్, మార్కెట్ ను ఈ సినిమా పది రెట్లు పెంచేసింది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఎలా వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా ఓటీటీలో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ నుంచి 8 వారాల తర్వాత ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. హనుమాన్ డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ (Hanu Man) కలెక్షన్లను బ్రేక్ చేయడం మరో చిన్న సినిమాకు ఇప్పట్లో సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!