అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు తారకరత్న!
- April 12, 2016 / 02:21 PM ISTByFilmy Focus
కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనానికి బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు మొన్నా ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కు జరిమానా విధించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కార్ లోపలే ఉండడంతో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు తారకరత్న వంతు వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో సోమవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న తారకరత్న కారును పోలీసులు ఆపారు. బ్లాక్ స్టిక్కర్‌తో వాహనం నడుపుతున్నందుకు జరిమానా విధించారు. అంతేకాదు ఆ స్టిక్కర్ కూడా తొలగించారు. పోలీసులు సినీ సెలెబ్రిటీల కార్లకు కూడా ఫైన్స్ విధించడంతో అందరు జాగ్రత్త పడుతున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















