గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అలాగే మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రక రకాల ట్వీట్లు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను వర్మ ఇరిటేట్ చేసిన సంగతి తేలిసిందే. ఒకానొక సమయంలో నాగబాబు కూడా వర్మ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కూడా కొన్ని సార్లు సహనం కోల్పోయి కొన్ని పంచ్ లు కూడా వేసాడు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వలెన మెగా ఫ్యామిలీ నుండీ నందమూరి ఫ్యామిలీ కి డైవర్ట్ అయిన వర్మ… మళ్ళీ పవన్ పైన ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పనైపోయిందనుకుంట… ఇప్పుడు మళ్ళీ పవన్ పై కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు.
రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ… ‘పవన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. ఇంతకముందు పవన్ ని చూడాలంటే సినిమా పేజీ వరకూ వెళ్ళాల్సి వచ్చేది. పవన్ ముఖ్యమంత్రయితే మొదటి పేజీలోనే చూడొచ్చు.. ఓ అందమైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకోగలరు” అంటూ కామెంట్ చేసాడు. దీంతో పాటూ కేఏ పాల్ ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఎందుకంటే.. ‘ఇదివరకు కామెడీ కోసం థియేటర్ కి వెళ్ళేవాళ్ళం. ఒకవేళ పాల్ ముఖ్యమంత్రయితే ఆ అవసరం ఉండదు’ అంటూ పంచ్ వేసాడు వర్మ. ఇక వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 29 న ప్రేక్షకుల ముందుకురానుంది.