అజ్ఞాతవాసి టీమ్ కొత్త ప్లాన్

భారీ అంచనాలతో నిన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి.. అంచనాలను తారుమారు చేస్తూ మిశ్రమ స్పందన అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ పైన సినీ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాని ఇలా తీస్తారా? అంటూ అభిమానులు మాటల మాంత్రికుడిపై మండిపడుతున్నారు. జరిగిందేదో జరిగింది.. సినిమా కొన్నవారికి నష్టం రాకుండా ఉండేలా చిత్ర బృందం కొత్త ఆలోచనలు చేస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాణ సమయంలో చెప్పారు. అంతేకాదు అజ్ఞాతవాసి టైటిల్స్ లోను వెంకటేష్ కి థాంక్స్ కార్డు కూడా వేశారు. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల వెంకీ సీన్ ని పక్కన పెట్టారు. ఆ సన్నివేశాన్ని కలిపితేనైనా కలక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అందుకే ఆ సీన్స్ కలిపే పనులను మొదలు పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. రెండు రోజుల్లో ఎడిటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి వెంకటేష్ ఉన్న అజ్ఞాతవాసిని ప్రేక్షకులకు చూపించనున్నట్టు సమాచారం. సో థియేటర్ కి ఆడియన్స్ ని రప్పించే బాధ్యత వెంకటేష్ పై పడింది. మరి ఈ ప్లాన్ ఎంత మేర సక్సస్ అవుతుందో చూడాలి. 17 వరకు అజ్ఞాతవాసి అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఉంది. ఈ వారం రోజుల్లోనే అజ్ఞాతవాసి నష్టాల భారీ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus