ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో కొత్త సినిమాలకు పెరుగుతున్న బిజినెస్ అంతా ఇంతా కాదు. ఒక రకంగా నిర్మాతలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లో ఓటీటీ రైట్స్ ఆరో ప్రాణంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ హక్కుల్లోనే సగం బడ్జెట్ దక్కుతోంది. డైరెక్ట్ గా రిలీక్ చేస్తే కొంతమంది లాభం వచ్చే ఫిగర్స్ కూడా చెబుతున్నారు. ఇక ఓటీటీ పోటీల్లో ఆహా మిగతా కంపెనీలకు పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే క్రాక్ ను దక్కించుకొని క్యాష్ చేసుకున్న ఆహా రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాలను దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తరువాత శేఖర్ కమ్ముల లవ్ స్టొరీతో పాటు మరో రెండు కొత్త సినిమాలు కూడా ఆహా యాప్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. అందులో అఖిల్ సినిమా కూడా ఉంది. గీతా ఆర్ట్స్ GA2లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఆహాలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక మరోవైపు నాగశౌర్య లక్ష్య మూవీ డీలింగ్ కూడా సెట్టయ్యింది. ఆ సినిమాలో నాగశౌర్య నెవర్ బిఫోర్ అనేలా సిక్స్ ప్యాక్ ఫిట్నెస్ తో సరికొత్తగా కనిపించనున్నాడు. వీటితో పాటు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా ఆహా ప్లాన్ చేస్తోంది.