Mrunal Thakur: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో హాట్ ఫోటోస్ క్రియేట్ చేస్తున్న ఫ్యాన్స్!

“బాత్ టబ్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అదిరిపోయిందిగా” అంటూ తెగ సొంగ కార్చేశారు సోషల్ మీడియా జనాలు. కట్ చేస్తే.. అది రియల్ ఫోటోషూట్ కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఫోటో అని క్లారిటీ వచ్చింది. అలా మృణాల్ విషయంలో ఇప్పుడు రోజూ ఏదో ఒక ఫొటో వస్తుంది. ఆ ఫోటోలు ఎంత సహజంగా ఉన్నాయంటే.. అవి ఫేక్ అంటే నమ్మడం కష్టమే. జనాలు మళ్లీ మృణాల్ ఇన్స్టాగ్రామ్ కి వెళ్లి ఆమె ప్రొఫైల్ లో ఆ ఫోటోలు కనిపించకపోయేసరికి అవి ఫేక్ ఫోటోలు అని క్లారిటీ తీసుకుంటున్నారు.

Mrunal Thakur

అయితే.. ఈ ఏఐ అనేది కేవలం మృణాల్ ఠాకూర్ కి మాత్రమే ఎఫెక్ట్ అవ్వలేదు. చాలామంది ఈ ఏఐ బారిన పడ్డారు. కానీ.. మృణాల్ ఫోటోలు వైరల్ అయినట్లుగా మిగతావాళ్ళ ఫోటోలు వైరల్ అవ్వలేదు. అందుకు కారణం ఆ ఫోటోలు అంత సహజంగా ఉండడమే. ఈ విషయంలో మృణాల్ & టీమ్ తెగ టెన్షన్ పడుతున్నారు. ప్రతిసారి ఆ ఫోటోలు ఒరిజినల్ కావు అని క్లారిటీ ఇవ్వలేక వాళ్ళ తల ప్రాణం తోకకి వస్తుందట. మొన్ననే ఆ బాత్ టబ్ ఫోటోలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చాక, ఇప్పుడు బీచ్ ఫోటోలు వచ్చాయి.

అవి కూడా ఫేక్ అని క్లారిటీ ఇవ్వాలా లేక వదిలేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే.. ఇలా క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే రోజుకో ఫోటో వస్తుంది కాబట్టి.ఇకపోతే.. మృణాల్ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. హిందీలో మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. అప్పట్లో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అన్నారు కానీ.. అది ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. మరి మృణాల్ మళ్లీ తెలుగులో ఎప్పడు కనిపిస్తుందో చూడాలి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus