Aishwarya , Umapathy: ఒక్క సినిమాలో నటించకపోయిన ఐశ్వర్య ఉమాపతి ప్రేమలో ఎలా పడ్డారో తెలుసా?

యాక్షన్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలియజేయడంతో త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. ఐశ్వర్య అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్,కన్నడ సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న నటిస్తున్నారు.

ఇక నటుడు ఉమాపతి రామయ్య సైతం పలు సినిమాలలో హీరోగా నటిస్తూ గుర్తింపు పొందారు కానీ వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో కూడా నటించలేదు. ఆయనప్పటికీ వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. మరి ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయానికి వస్తే… ఐశ్వర్య ఉమాపతి ఇద్దరు మొదటిసారి అర్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి సర్వైవర్ రియాలిటీ షోలో కలుసుకున్నారని తెలుస్తోంది.

ఈ రియాలిటీ షోలో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్ గా ఉన్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇలా ఏర్పడిన ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది.ఇక అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తంబి రామయ్య కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమలో ఉన్నారని కుటుంబ సభ్యులు గ్రహించినట్లు తెలుస్తోంది.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులు గ్రహించడంతో వీరిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా చేయడానికి నిశ్చయించుకున్నారట. వీరి వివాహం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగబోతుందని తెలుస్తోంది. అర్జున్ ఒక స్టార్ నటుడు అలాగే తంబి రామయ్య కూడా స్టార్ యాక్టర్ కావడంతో వీరి పిల్లల వివాహం సౌత్ ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు జరగని విధంగా వీరి వివాహం ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus