రజినీకాంత్ నటనకు దూరం కావాలని కోరుకుంటున్న ఐశ్వర్య!

నాలుగు దశాబ్దాలుగా తెలుగు, తమిళ ప్రజలను తన స్టైల్, యాక్షన్, డైలాగ్స్ తో అలరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు మానేస్తే మంచిదని అంటున్నారు… ఈ మాట వినడానికి అభిమానులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నా.. స్వయానా రజినీకాంత్ కుమార్తె  ఐశ్వర్య  ఈ మాట అనడంతో ఏమి చెప్పాలో తెలియక బాధపడుతున్నారు. అరవైఏడేళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తక్కువకాకుండా ఫుల్ ఎనర్జీ తో సినిమాలు చేస్తున్న తండ్రిపై ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. స్టార్ హీరో కాబట్టి ఎంత బిజీగా ఉంటారో.. ఆ విషయం రజిని కుటుంబసభ్యులకు బాగా తెలుసు.

అందుకే ఇక కష్టపడింది చాలు.. ఇంటిపట్టున ఉండి అతని సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయిస్తే మంచిదని ఐశ్వర్య కోరుకుంటోంది. ఈ విషయాన్నీ ఆమె తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది. “నటన ద్వారా ప్రేక్షకులను సంతోషపెడుతున్న నాన్న పూర్తిగా సినీ రంగంపైనే దృష్టిసారించడం తగదు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సినిమాలకు దూరం కావాలని తాను చెప్పడం లేదు. దశలవారీగా సినిమాలను తగ్గించుకుని కుటుంబంతో ఎక్కువగా గడపాలని కోరుకుంటున్నాను” అని ఐశ్వర్య చెప్పింది. మరి కుమార్తె కోరికను రజినీ కాంత్ తీరుస్తారా? లేదా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus