మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో టీమ్ ఇండియా ప్లేయర్ అజింక్య రెహానే అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. రీసంట్ గా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో సెంచరీ చేయడం వల్ల ఆ టెస్ట్ మ్యాచ్ ని గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు రెహానే. అంతేకాదు, మాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. అందుకే, ఆస్ట్రేలియన్ బోర్ట్ జానీ ముల్లగ్ పతకాన్ని ఇచ్చి సత్కరించింది.
అంతేకాదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండే బోర్ట్ పైన రెండోసారి తన పేరుని నమోదు చేసుకున్నాడు అజింక్య రెహానే. ఈ నేమ్ బోర్డ్ పైన పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. క్రికెట్ లవర్స్ అందరూ ఈ వీడియోని తెగ షేర్లు చేసేస్తున్నారు. 2014 లో కూడా రెహానే సెంచరీ చేసినపుడు ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడు ఇదే బోర్డ్ పైన తన పేరుని రాశారు.
అలాగే, ఇప్పుడు ఆరేళ్ల తర్వాత 2020లో మరోసారి సెంచరీ చేసి మ్యాచ్ ని గెలిపించి తన పేరుని రాయించుకున్నాడు. దీంతో అందరూ శభాష్ రెహానే అంటూ ఈ వీడియోని షేర్లు చేస్తున్నారు. టీమ్ ఇండియా బోర్ట్ ఈ వీడియోని అఫీషియల్ గా షేర్ చేయడం విశేషం.