‘ఓజీ’ సినిమా ఫస్ట్ సాంగ్ ఫైర్‌స్టార్మ్‌తో మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డులు బద్ధలయ్యాయి. ఆ బీట్, మిక్సింగ్‌కి ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ ఫిదా అయిపోయారు. ఇక ‘సువ్వీ సువ్వీ’ పాటతో అయితే మెలోడీ అంటే ఇష్టం ఉన్న వాళ్లు మురిసిపోయారు. ఈ రెండు పాటల్లోనూ మ్యూజిక్ కొత్తగానే వినిపించింది. అంతకుముందు వచ్చిన టీజర్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే పాటలు, ట్రైలర్, సినిమా వీటికి మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటే.. మొన్న ఓ కొత్త రకం పరికరంతో కనిపించారు.
కోటో అనే ఆ జపనీస్ వాద్య పరికరం గమ్మత్తుగా కనిపించింది. ఇదిలా ఉండగా 117 మంది మ్యుజీషియన్స్‌తో వర్క్ చేస్తున్నట్లు తాజాగా మరో పోస్ట్ పెట్టారాయన. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా విషయంలో తమన్ ఎంతటి కేర్ తీసుకుంటున్నాడు, ఎంతటి కొత్తదనం చూపించబోతున్నాడు అనేది అర్థమవుతోంది. ఇక సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సినిమాలో విలన్ రోల్ చేస్తుండగా శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న సినిమాను సెప్టెంబరు 25న విడుదల చేస్తున్నారు.