Ajith: ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడిన అజిత్‌ మాటలు వైరల్‌.. అంతగా ఏం చెప్పాడంటే?

సినిమా హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్‌ వార్స్‌ ఎక్కువ. ఇప్పుడు ఎక్స్‌కి ఇది పరిమితమైపోయింది కానీ.. ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కువగా ఉండేది. ఈ విషయంలో ఇప్పుడు ఇండియా అంతా ఒక్కలానే ఉంది కానీ.. ఆఫ్‌లైన్‌ రోజుల్లో అయితే తమిళనాట ఫ్యాన్ వార్స్‌ ఎక్కువా ఉండేవి అంటారు. ఈ క్రమంలో హీరోలు తరచూ అభిమానులకు హితబోధ చేస్తూ వచ్చారు. తాజాగా అజిత్‌ మరోసారి ఆ పనే చేశాడు.

Ajith Kumar

దుబాయ్‌ కారు రేసింగ్‌లో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్న అజిత్‌.. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇతరులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పని సక్రమంగా, కష్టపడి చేయండి అని అజిత్‌ హితవు పలికాడు.

మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉంది. కానీ ముందు మీ జీవితం చూసుకున్నాకే ఏదైనా అని గుర్తుంచుకోండి. నా అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. మీ పక్క వ్యక్తి ఏదో చేస్తున్నాడు అనుకొని హైరానా పడకండి. మీ జీవితంపై దృష్టి పెట్టండి. ‘జై అజిత్‌.. జై విజయ్‌..’ అని జై కొడుతూ ఉంటే.. మీరెప్పుడు జీవిస్తారు అని కాస్త ఘాటుగా కామెంట్‌ చేశాడు అజిత్‌.

దీంతో అజిత్‌ ఇలా ఎందుకు అన్నాడు. రీసెంట్‌గా ఏమైంది అనే చర్చ మొదలైంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాట విజయ్‌, అజిత్‌ సినిమాలు వచ్చినప్పుడు ఇరు వర్గాల అభిమానుల మధ్య వాదనలు, విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అజిత్‌ ఇలా మాట్లాడాడు అని అంటున్నారు. ఇక అజిత్‌ సినిమాల సంగతి చూస్తే.. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదా ముయార్చి’, అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాల్లో నటిస్తున్నారు.

హీరో పై హీరోయిన్ సంజన సంచలన వ్యాఖ్యలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus