నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

అవును అజిత్ సినిమాకి నెట్ ఫ్లిక్స్ సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది. అందుకు కారణం ఓ సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు. విషయంలోకి వెళితే.. అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా రూపొందింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Ajith Kumar

ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా వాడారంటూ సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీ రైట్ యాక్ట్ కింద.. రూ.5 కోట్ల నష్టపరిహారం అందించాలని కూడా ఇళయరాజా అందులో పేర్కొన్నారు. దీనిపై నిర్మాతలైన నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లకు కూడా నోటీసులు అందాయి.

అయితే రిలీజ్ కి ముందే ఆ పాటల హక్కుదారుల నుండి అనుమతులు తీసుకున్నామని.. కాబట్టి, ఇళయరాజా నోటీసులు చెల్లవని నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కౌంటర్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని డిలీట్ చేసింది. రిలీజ్ కి ముందు భారీ రేటుకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ హక్కులు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

మరి ఈ ఇష్యూ ఎప్పుడు క్లియర్ అవుతుందో..? మళ్ళీ ఎప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్ ఫ్లిక్స్ కి అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus