Akash Puri: డబుల్ ఇస్మార్ట్ టీజర్ పై ఆకాశ్ పూరీ అప్డేట్.. అలా ఉండబోతుందా?

రామ్ పోతినేని (Ram) పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కిన (iSmart Shankar) ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double ISmart) తెరకెక్కుతుండగా శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ పై ఆకాశ్ పూరీ (Akash Puri)  అప్డేట్ ఇవ్వగా ఆ అప్డేట్ వైరల్ అవుతోంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని ఈ సినిమా షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుందని ఆకాశ్ పూరీ అన్నారు. మొన్న రఫ్ గా డబుల్ ఇస్మార్ట్ టీజర్ చూశానని ఆయన కామెంట్లు చేశారు. టీజర్ అమేజింగ్ గా ఉందని రామ్ అభిమానులకు అయితే ఈ టీజర్ ఒక బ్లాస్ట్ అని ఆకాశ్ పూరీ అభిప్రాయపడ్డారు. నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆకాశ్ పూరీ పేర్కొన్నారు.

వెయిటింగ్ ఫర్ ది అప్ డేట్ అంటూ ఆకాశ్ పూరీ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆకాశ్ పూరీ హీరోగా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తుండగా రాబోయే రోజుల్లో ఆకాశ్ పూరీ కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఆకాశ్ పూరీ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ కావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆకాశ్ పూరీ త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తానని చెబుతున్నారు. నాన్న డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదని భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఆకాశ్ పూరీ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నేనింతే2 (Neninthe) సినిమాలో నటిస్తానని ఆకాశ్ పూరీ చెబుతుండగా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus