Akash Puri Remuneration: ఆకాశ్ పూరీ తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా?

తక్కువ సినిమాల్లోనే నటించినా పూరీ జగన్నాథ్ కొడుకుగా ఆకాష్ పూరీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఆకాశ్ పూరీ నటించిన చోర్ బజార్ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంట్లో పండు అనే పదాన్ని నాన్న ఎక్కువగా వాడతారని నాన్న అమ్మని పండు అని పిలుస్తారని ఆకాశ్ పూరీ చెప్పుకొచ్చారు. తన తొలి రెమ్యునరేషన్ లక్ష రూపాయలు అని ఆకాశ్ పూరీ అన్నారు.

తొలి పారితోషికంలో 50,000 రూపాయలు అమ్మమ్మకు, 50,000 రూపాయలు నాన్నమ్మకు ఇచ్చానని అకాశ్ పూరీ అన్నారు. చోర్ బజార్ నా మూడో మూవీ అని చాలా కష్టపడి ఈ సినిమాలో నటించానని ఆకాశ్ పూరీ చెప్పుకొచ్చారు. చోర్ బజార్ మూవీలో నా పాత్ర పేరు బచ్చన్ సాబ్ అని దర్శకుడు జీవన్ చెప్పగానే చాలా బాగా అనిపించిందని ఆకాశ్ పూరీ వెల్లడించారు. నాన్న తొలి సినిమా బద్రి అని అంతకు నుందు నాన్న డైరెక్షన్ లో రెండు సినిమాలు మొదలై ఆగిపోయాయని ఆకాశ్ పూరీ పేర్కొన్నారు.

బుజ్జిగాడు మూవీలో తాను, చెల్లి లవర్స్ లా కనిపించడంతో అందరూ కామెడీ చేశారని చిరుత, బుజ్జిగాడు సినిమాలలో తాను నటించానని ఆకాశ్ పూరీ వెల్లడించారు. చిరుత సినిమాలోని ఒక సీన్ ను చూసి అమ్మ ఏడ్చేసిందని ఆకాశ్ అన్నారు. నేనింతే సినిమాకు ప్రొడక్షన్ బాయ్ గా పని చేశానని ఆకాశ్ పూరీ తెలిపారు. చెల్లి ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటివి ప్లాన్ చేస్తోందని త్వరలో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాలని భావిస్తోందని ఆకాశ్ పూరీ కామెంట్లు చేశారు.

నాన్న అంటే చిన్నప్పటి నుంచి తెలిసీతెలియని భయం అని ఆకాశ్ పూరీ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్ నార్మల్ గా చెబుతున్నానని ఆ సమయంలో హరీష్ శంకర్ అరవడం రాదా అని తిట్టారని ఆకాశ్ పూరీ అన్నారు. హరీష్ శంకర్ తిట్టడం నాకు హెల్ప్ అయిందని ఏ డైలాగ్ ఎంత ఎమోషన్ లో చెప్పాలో అర్థమైందని ఆకాశ్ పూరీ వెల్లడించారు. గబ్బర్ సింగ్ సినిమాలోని రోల్ వల్ల తనకు మంచి గుర్తింపు దక్కిందని ఆకాశ్ పూరీ చెప్పుకొచ్చారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus