Akash Puri: ‘బుజ్జిగాడు’ పై ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తనయుడు ఆకాష్ పూరి (Akash Puri) అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన ఇతను హీరోగా మారి (Mehbooba) ‘మెహబూబా’ (Romantic) ‘రొమాంటిక్’ ‘చోర్ బజార్’ (Chor Bazaar) వంటి సినిమాలు చేశాడు. హీరోగా ఆకాష్ ఫుల్ బిజీ. ఇప్పుడు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టేసాడు అని చెప్పాలి. విషయం ఏంటంటే.. ఆకాష్ పూరి ‘ఆర్.సి ట్రెండ్ సెట్టర్స్’ అనే అబ్బాయిల క్లోతింగ్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యాడు.

దీనికి సంబంధించిన ప్రెస్-మీట్ ఈరోజు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఇందులో భాగంగా.. మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అతనికి (Prabhas) ప్రభాస్ (Bujjigadu) ‘బుజ్జిగాడు’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ సినిమాలో ఆకాశ్ పూరి .. చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేశాడు. కాబట్టి.. ‘బుజ్జిగాడు 2’ అంటూ చేస్తే మీరు అందులో హీరోగా చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆకాష్ పూరి బదులిస్తూ.. ” ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ టీవీల్లో బాగా చూశారు.

ఇప్పుడు అది ప్రేక్షకుల దృష్టిలో ఓ క్లాసిక్. అలాంటి సినిమాలను సీక్వెల్స్ గా చేసి చెడగొట్టకూడదు.ఛాన్స్ ఉంటే రీ రిలీజ్..లు చేసి చూసుకోవాలి అంతే..! కానీ నాకు ‘నేనింతే’ అనే సినిమా చాలా ఇష్టం. ఒకవేళ ఆ సినిమాకి కనుక ‘నేనింతే 2 ‘ అంటూ సీక్వెల్ చేస్తే ‘అందులో నాకు నటించాలని ఆశ ఉంది’ అంటూ ఆకాష్ పూరి చెప్పుకొచ్చారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus