Akhanda: పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 ప్లానింగ్?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాలను అందుకుంటారనే సెంటిమెంట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ అఖండ సినిమాలు మూడు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రస్తుత కాలంలో థియేటర్లో ఒక్క సినిమా నెలరోజులు కూడా రన్ అవడం కష్టతరంగా ఉంది. అలాంటిది అఖండ సినిమా ఏకంగా వంద రోజులను పూర్తి చేసుకొని సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నటించిన ఆ ఘోర పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 చిత్రాన్ని నిర్మించాలని నిర్మాతలు పెద్దఎత్తున ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రాజకీయాలతో ముడిపడి ఉండడం వల్ల ఈ చిత్రాన్ని 2024 ఎన్నికల ముందు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి తన భావను హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి తన బావను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అఖండ సీక్వెల్ సినిమా పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బోయపాటి శీను కూడా రామ్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇక బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అఖండ సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.ఈ విధంగా అఖండ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus