Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది అనుకునేలోపే ఊహించని షాక్ తగిలింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ‘అఖండ 2’ కోసం ఈరోజు రాత్రి ప్లాన్ చేసిన పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ ఇండియాలో రద్దయ్యాయి. టికెట్లు బుక్ చేసుకుని, థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైన ఫ్యాన్స్ కి ఇది మింగుడుపడని వార్త. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.

AKHANDA 2

అసలు ప్రీమియర్స్ ఎందుకు ఆగిపోయాయనే దానికి నిర్మాతలు సాంకేతిక కారణాలని చెబుతున్నారు. “మేము మా వంతు ప్రయత్నం చేశాం, కానీ కొన్ని విషయాలు మా చేతిలో లేకుండా పోయాయి. టెక్నికల్ సమస్యల వల్ల ఇండియాలో ఈరోజు జరగాల్సిన ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేస్తున్నాం” అని వెల్లడించారు. చివరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం నిజంగా దురదృష్టకరం. అసలే భారీ హైప్ ఉన్న సినిమా కావడంతో, ఈ బ్రేక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

అయితే ఓవర్సీస్ లో ప్లాన్ చేసిన ప్రీమియర్స్ అన్నీ యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అంటే అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఈరోజు రాత్రికే ‘తాండవం’ చూసే అవకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చే టాక్ మీదే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇండియాలో షోలు లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా రివ్యూలు వచ్చేస్తాయి కాబట్టి ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.

నిజానికి ఈ ప్రీమియర్స్ ద్వారా భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని టీమ్ భావించింది. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేకంగా టికెట్ రేట్ హైక్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆ ప్లాన్ క్యాన్సిల్ అయినట్లు మేకర్స్ చెబుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తారా? లేక ఆ టికెట్లనే రేపటి షోలకు మారుస్తారా? అనే దానిపై థియేటర్ యాజమాన్యాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus