Akhanda: బోయపాటి బాలయ్య ఫ్యాన్స్ కోరిక తీరుస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శనివారం రోజున అఖండ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అడిగా అడిగా అంటూ థమన్ స్వరపరిచిన మెలోడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ సాధిస్తోంది.

బాలకృష్ణను అందంగా చూపించే డైరెక్టర్లలో బోయపాటి ముందువరసలో ఉంటారని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా సినిమాలో కొంత సమయం అఘోరాగా కనిపించనున్నారు. టికెట్ రేట్లు పెరగడంతో పాటు 100 శాతం ఆక్యుపెన్సీ వస్తే మాత్రమే అఖండ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య యాక్టివ్ గా కనిపిస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. దసరాకు అఖండ రిలీజవుతుందో లేదో మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ సింగిల్ ను చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో పోషిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus