సెకండ్ ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్న తర్వాత పెద్ద సినిమా ఏది విడుదల కాలేదు. ఏపిలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యు వల్ల మిడ్ రేంజ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కావడం లేదు. అయితే డిసెంబర్ 2న ధైర్యం చేసి బాలయ్య- బోయపాటి ల ‘అఖండ’ వస్తుంది. ‘సింహా’ ‘లెజెండ్’ కాంబో కావడం… సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
మరో వైపు ఇండస్ట్రీ చూపంతా కూడా ఈ సినిమా ఫలితం పైనే ఆధారపడి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1550 స్క్రీన్ లలో రిలీజ్ అవుతుంది. మొదటి రోజు టాక్ బాగుంటే మరిన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ ను బట్టి చూస్తే ‘అఖండ’ చిత్రం మొదటి రోజు రూ.11 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసే అవకాశం ఉంది.
సోలో రిలీజ్ కాబట్టి.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని 4 రోజులు మొదటి రోజు లానే హోల్డ్ చేస్తే… వీకెండ్ కు 70శాతం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఆ అవకాశాల్ని ‘అఖండ’ ఎంత వరకు ఉపయోగించుకుంటుందో..!