Akhanda, RRR movie: బాలయ్య, తారక్ మధ్య పోటీ తప్పదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అఖండ మూవీ ఆర్ఆర్ఆర్ తో రెండుసార్లు పోటీ పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. ఆగష్టు 1వ తేదీన ఆర్ఆర్ఆర్ నుంచి ఒక పాట రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

అఖండ మూవీ నుంచి కూడా ఆగష్టు తొలి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే అఖండ చిత్రయూనిట్ నుంచి ఫస్ట్ సింగిల్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు తాజాగా ఒక ఇంటర్యూలో బాలకృష్ణ అఖండ అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు చేశారు. అక్టోబర్ తొలి వారంలోనే అఖండ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అఖండకు, ఆర్ఆర్ఆర్ కు మధ్య గ్యాప్ ఉన్నా ఒక విధంగా బాలయ్య, తారక్ మధ్య పోటీ ఉన్నట్టేనని చెప్పాలి.

ఫస్ట్ సింగిల్ టాక్ విషయంలో ఆర్ఆర్ఆర్ పైచేయి సాధిస్తుందో లేక అఖండ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ సినిమా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో మూవీ కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో బాలకృష్ణ నటించిన లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు మాత్రమే హిట్ కావడంతో బాలకృష్ణ సైతం అఖండ సినిమాతో భారీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus