Akhanda Movie: ఆ డేట్ పై దృష్టి పెట్టిన అఖండ?

  • October 30, 2021 / 11:41 AM IST

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. స్టార్ హీరో బాలకృష్ణ డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడని సమాచారం. అయితే అదే రోజున థియేటర్లలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ రిలీజ్ కావాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్యామ్ సింగరాయ్ డేట్ ను నాని బాలయ్య కోసం త్యాగం చేసే ఛాన్స్ ఉంది.

సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని అఖండ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్య, ఎఫ్3 సినిమాలు ఫిక్స్ అయ్యాయి. డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్1 సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో వారం రోజుల గ్యాప్ తో అఖండను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే అఖండ ఆ తేదీన రిలీజైతే శ్యామ్ సింగరాయ్ కు సరైన డేట్ దొరకడం కష్టమవుతుంది. బాలయ్య, నాని సినిమాలు ఒకేరోజు రిలీజైతే నాని సినిమా నష్టపోవాల్సి ఉంటుంది. శ్యామ్ సింగరాయ్ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ కు గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus