కరోనా వైరస్, లాక్‌డౌన్ మళ్లీ ఒమిక్రాన్‌ల కారణంగా చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో కళాకారులు, టెక్నీషియన్లు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మళ్లీ సాధారణ పరిస్ధితులు వచ్చేలోపు ఏదో ఒక కొత్త వేరియంట్ రావడం.. మళ్లీ నిబంధనలు అమలు చేయడం షరా మామూలు అయిపోయింది.
ఈ పరిస్థితుల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్ పూర్తిగా కళ తప్పింది. మధ్యలో ఓటీటీ ల ద్వారా వినోదం అందించే ప్రయత్నం చేసినప్పటికీ.. థియేటర్ మజా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. ఇలాంటి సమయంలో అసలు థియేటర్లలోకి పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయాలా..? వద్దా..? అన్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ డేర్ చేసి అఖండను రిలీజ్ చేశాడు. కరోనాకి తోడు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించింది. అయినప్పటికీ బాలయ్య అడుగు ముందుకేశాడు.
ఈ ఫలితం వృథా కాలేదు. ‘అఖండ’కు జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లారంటే అతిశయోక్తి లేదు. రూ.54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘అఖండ’ ఫుల్ రన్లో రూ.73 కోట్ల వరకు షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత అల్లు అర్జున్ ‘పుష్ప’, పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’, అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ఇలా వరుసగా పెద్ద సినిమాలు దిగుతున్నాయి.
ఇవన్నీ కూడా కోట్లాది వసూళ్లు కుమ్మేశామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవానికి ఏ సినిమా పెద్ద హిట్ అంటే.. ‘అఖండ’ నే అని డిస్ట్రిబ్యూటర్లు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందుకు కారణాలేంటో ఒకసారి చూస్తే.. గోదావరి జిల్లాలో ఓ థియేటర్ ‘అఖండ’తో ప్రారంభమై.. పుష్ప, బంగార్రాజు, రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్ అన్ని సినిమాలు విడుదలయ్యాయి. ‘అఖండ’ సినిమాను రూ.2.50 లక్షలకు కొనుగోలు చేయగా.. ఇది రెండు వారాల్లోనే రూ.6.50 లక్షలు రాబట్టింది.
పుష్ప సినిమాను రూ.5 లక్షలకు కొంటే పెట్టిన మొత్తం తిరిగి వచ్చింది తప్ప.. లాభాలు రాలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ ను తక్కువ రేటుకే కొన్నా స్వల్ప నష్టం వచ్చిందట. ఆ తర్వాత పరిస్ధితులు చక్కబడటంతో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను రూ.5 లక్షలకు కొంటే లక్ష నష్టం వచ్చింది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఆదుకుంటుంది అనుకుని రూ.5 లక్షలకు తీసుకుంటే రూ.2లక్షల నష్టం మిగిలింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని రూ.14లక్షలకు కొనుక్కున్నారు.
రాజమౌళి మ్యాజిక్.. ఎన్టీఆర్- చరణ్‌లు సైతం వారిని బయటపడలేకపోయారట. కట్ చేస్తే లక్షన్నర నష్టం వచ్చిందని వారు వాపోయారు. ఈ లెక్కలన్ని చూస్తే బాలయ్య ‘అఖండ’ మాత్రమే బ్లాక్ బస్టర్ అయినట్టని వారు చెబుతున్నారు. అటు తర్వాత మళ్ళీ ఈ సినిమాని సెకండ్ రిలీజ్ చేయగా అప్పుడు కూడా లాభాలు అందించింది అని వారు చెబుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు ఏపిలో చాలా థియేటర్ యాజమాన్యాలకు ‘అఖండ’ భారీ లాభాలను అందించింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!