అఖిల్ రెండో చిత్రం రీమేక్ కాదట..!

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘అఖిల్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో.. అఖిల్ రెండో చిత్రం పై నాగ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హిందీ లో హిట్ కొట్టిన యే జవానీ హై దివానీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని, ఇదే అఖిల్ రెండో చిత్రమని,  ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని వార్తలు వినవచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం వంశీ రెడీ చేసిన కొత్త కథతోనే అఖిల్ రెండో చిత్రం రూపుదిద్దుకోనుందని, ఈ మేరకు నాగార్జునను కూడా ఈ కథతో ఒప్పించాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని పి‌వి‌పి బ్యానర్ పై నిర్మిస్తారా లేక అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నిర్మిస్తారా? ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు.. ? ఈ చిత్ర బృందానికి సంబంధించిన తదితర వివరాలు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus