రెండో చిత్రం పై క్లారిటీ ఇచ్చిన అఖిల్

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు స్పందించాడు. తన రెండో చిత్రం పై క్లారిటీ ఇచ్చాడు. మొదటి సినిమా “అఖిల్” పరాజయంతో ఈ సారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సంగతిని స్వయంగా బుధవారం వెల్లడించాడు. “డైరక్టర్  హను రాఘవపూడి తో కలిసి స్క్రిప్ట్ వర్కులో పాల్గొన్నాను. చాలా బాగా వచ్చింది. నేటితో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. నా రెండో చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. సాధ్యమైనంత త్వరగా సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడిస్తాను” అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ మణిరత్నంగా పేరు తెచ్చుకున్న హను “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” తో కమర్షియల్ డైరక్టర్ గా నిరూపించుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన కింగ్ నాగార్జున అఖిల్ కి రెండో సినిమాకోసం కథ సిద్ధం చేయమని హను కి సూచించాడు. నాగ్ కోరిక మేరకు, అక్కినేని అభిమానులకు నచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేసి ఒకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని కిలారు వెంకట రత్నం నిర్మించనున్నట్లు సమాచారం. యాక్షన్, లవ్ ఎంటర్ టైన్ జాన్రాలో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus