పార్టీలో ప్రభాస్, చరణ్ ఉండాల్సిందే అంటున్న అఖిల్!

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటిస్తున్న హలో సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నాగార్జున  నిర్మించిన ఈ మూవీ క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అఖిల్ అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. తన బెస్ట్ ఫ్రెండ్ రానా తో కలిసి పార్టీ చేసుకుంటే ఆ పార్టీలో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరని అఖిల్ అన్నారు. రానాతో కలిసి ఎక్స్ క్లూజివ్ గా పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి ఎవర్ని పిలుస్తారనే ప్రశ్నకు అఖిల్ ఇలా స్పందించారు.

“నేను ఎప్పుడు పార్టీ చేసుకున్నా అక్కడ రానా ఉండాల్సిందే. నాకు అలా అలవాటైపోయింది. ఇక మేమిద్దరం కలిసి కూర్చున్నప్పుడు.. ఎక్కువగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. పార్టీలో ప్రభాస్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక నాకు, రానాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్. పార్టీ ఉంటే చరణ్ కు కచ్చితంగా కాల్ చేస్తా.” అని అఖిల్ వివరించారు. ఇంకా మాట్లాడుతూ “మేమంతా పార్టీని చాలా బాగా  ఎంజాయ్ చేస్తాం… కానీ మా బ్యాచ్ లోకి మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ చేరారంటే మాత్రం రచ్చ అయిపోతుంది. వాళ్లిద్దరి అల్లరిని బ్యాలెన్స్ చేయడం మా వల్ల కాదు” అని అసలు విషయం చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus