మిస్టర్ మజ్నుతో ఆడియన్స్ ట్రస్ట్ ను తిరిగి పొందాలి: అఖిల్

అక్కినేని నాగార్జున తనయుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ సాధించలేదనే చెప్పాలి. మాస్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన వి.వి.వినాయక్ డైరెక్షన్లో చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ ఘోరమైన డిజాస్టరైన సంగతి తెలిసిందే. అయితే డ్యాన్సులకు, ఫైట్ల కు మాత్రం అఖిల్ కు మంచి మార్కులే పడ్డాయి. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలని నాగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అయిందేదో అయ్యిందిలే అనుకుని ‘మనం’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టాడు నాగ్. అఖిల్ రెండవ సినిమాగా వచ్చిన ‘హలో’ చిత్రం మంచి రివ్యూలను దక్కించుకున్నప్పటికీ సరైన కలెక్షన్లను రాబట్టలేక పోయింది.

టెన్షన్‌గా ఏమీ అనిపించలేదు. సాధారణంగా మజ్ను అంటే ట్రాజిక్‌ ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక్కడ ట్రాజిక్‌ విషయాలు ఉండవు.. ఓ కుర్రాడు జర్నీ గురించి చెబుతున్నాం కాబట్టి ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను పెట్టాం. అతను అమ్మాయిలను ప్రేమిస్తాడు.. అమ్మాయిలు అతన్ని ప్రేమిస్తాడు. మెయిన్‌గా చెప్పాలంటే ప్ల్లేబోయ్‌లాంటి కుర్రాడు లవర్‌బోయ్‌లా ఎలా మారాడనేదే కథ. మజ్ను అనే టైటిల్‌ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. దాన్ని నేను క్యారీ చేశాను. సినిమా హిట్‌ అయితే గర్వంగా ఫీలవుతాను. నా రెండు సినిమాలతో ఆడియన్స్ ను ట్రస్ట్ ను కోల్పోయాను.. ఈ సినిమాలో గెయిన్ చేస్తానన్న నమ్మకం ఉంది.

అఖిల్ కి అండగా చరణ్, ఎన్టీఆర్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus