మీరు ఇంట్లో ఉంటే నేను రాను అనేస్తా!

నాగచైతన్యతో సమంతకి పెళ్లవ్వడానికి ముందు నుంచీ అఖిల్ తో కలిసి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కోసం యాడ్స్ చసేది. సో, అప్పట్నుంచే అఖిల్ & సమంతకు మంచి ర్యాపో ఉండేది. అయితే.. అప్పటికి కేవలం అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ కావడంతో అఖిల్ ని బాగా ముద్దుగా చూసుకొనేది సమంత. అయితే.. పెళ్లాయ్యాక సమీకరణలు మారిపోయాయి. ఇప్పుడు ఇంటికి కోడలు, నాగచైతన్యకి భార్య, అఖిల్ కి వదిన అయ్యింది. దాంతో.. పాపం ఇంట్లో అఖిల్ మీద అజమాయిషీ చలాయిస్తోందట. ఛాన్స్ దొరికితే చాలు ర్యాగింగ్ కూడా చేస్తోందట. అది కూడా ఏరేంజ్ లో అంటే అఖిల్ బాబు ఏకంగా ఇంటికి వెళ్లడానికి కూడా భయపడుతున్నాడట.

ఈ విషయాన్ని అఖిల్ ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపాడు. అలాగే.. తనకు అమ్మానాన్న తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి కూడా సమంతే అని చెప్పడం విశేషం. అఖిల్ తాజా చిత్రం “హలో” డిసెంబర్ 22న విడుదలవుతుండగా.. ఈసారి నాగార్జునతోపాటు నాగచైతన్య-సమంతలు కూడా స్పెషల్ కేర్ తీసుకొని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. ఈ సినిమాతో అఖిల్ కు హిట్ ఇవ్వడమే కాక స్టార్ హీరోగా అతడ్ని నిలబెట్టడమే ధ్యేయంగా అక్కినేని కుటుంబం మొత్తం జాగ్రత్తలు తీసుకొంటుండడం చూస్తుంటే.. అఖిల్ ను లక్కీయస్ట్ హీరో అనకుండా ఉండలేం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus