బెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా నామినేట్‌ అయిన అఖిల్ “హలో” మూవీ

అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి సినిమా అఖిల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. రెండో సినిమా సంతోషాన్ని ఇచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేసిన హలో మూవీ విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ మంచి కలక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లోను అఖిల్ కి ఫాలోయింగ్ ని ఏర్పరిచింది.  కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో ‘హలో’ విదేశీ సినిమా కేటగిరీలో బెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా నామినేట్‌ అయ్యింది.

ఈ విషయాన్ని విక్రమ్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. “విదేశీ సినిమా కేటగిరీలో ‘హలో’ నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉంది. ఇందుకు నాగ్‌ సర్‌కు, అనూప్‌ రూబెన్స్‌, బాబ్‌ బ్రౌన్‌, పీఎస్ ‌వినోద్, ప్రవీణ్‌ పూడిలకు శుభాకాంక్షలు. మీరంతా యాక్షన్‌ ఎపిసోడ్లను మరింత ప్రత్యేకంగా వచ్చేలా చేశారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన అఖిల్‌కు శుభాకాంక్షలు. నీకున్న యాటిట్యూడ్‌ నిన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉండాలి” అని విక్రమ్ ట్వీట్ చేశారు. ఇందులో అఖిల్ అత్యంత సాహసోపేతమైన స్టెంట్స్ చేశారు. అందుకు ప్రతిఫలం దక్కబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus