Akhil Akkineni : అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చిన అక్కినేని అఖిల్. ప్రస్తుతం తన కెరీర్‌కు కీలకంగా మారిన లెనిన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. హీరోయిన్ భాగ్యశ్రీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉండటంతో, త్వరలోనే షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, అక్కినేని నాగార్జున కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం, 2026 మార్చిలో సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే… త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కానుందట.
ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ప్రతి సీన్, ప్రతి డీటెయిల్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకుంటున్నారని నాగ వంశీ తెలిపారు. అఖిల్‌కు ఇది చాలా కీలకమైన సినిమా కావడంతో, ఈసారి ఎలాంటి మిస్‌ఫైర్‌కు అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే దశాబ్దానికి చేరువైన కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్… లెనిన్ చిత్రంతో అయినా హిట్ అందుకోవాలనే ఆశతో ఉన్నారు. నాగార్జున ఇన్వాల్వ్‌మెంట్, మేకర్స్ కాన్ఫిడెన్స్ చూసిన అభిమానులు కూడా ఈసారి అఖిల్ ఖాతాలో గట్టి విజయం పడుతుందనే నమ్మకంతో ఉన్నారు.