కరోనా వచ్చిన తొలి రోజుల నుండి టాలీవుడ్‌లో ఓటీటీ జపం ఎక్కువగా వినిపిస్తోంది. థియేటర్లు తెరవరు, తెరిచినా జనాలు రారు అనే ఆలోచన రావడంతో అప్పటికే పూర్తయిన సినిమాలను ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అలా అనుకుంటున్నారు అని పుకార్లు వినిపించిన సినిమాల్లో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఒకటి. అయితే పదే పదే చిత్రబృందం అధికారికంగానూ, అనధికారికంగానూ ఖండిస్తూ వచ్చింది. అయితే ముందు అనుకున్నదే అయ్యేలా ఉంది. అంతే కాదు నిఖిల్ ‘18 పేజెస్’ కూడా ఓటీటీ తలుపు తడుతుంది అంటున్నారు.
అఖిల్‌కు రీ రీ రీ రీ రీ ఎంట్రీ అవుతుంది అనుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచ్‌లర్ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన పూర్వపు ఫామ్‌ను అందుకోవడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది అనుకున్నారు. ఓ పాట కూడా విడుదల చేశారు. మంచి పేరే వచ్చింది. ఈలోగా కరోనా రెండు వేవ్స్ వచ్చేశాయి. సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ఆగస్టు, సెప్టెంబరు వరకు వెయిట్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. అప్పటికి సినిమాలు, థియేటర్ల పరిస్థితి సెట్ కాకపోతే ఓటీటీకి ఇచ్చేస్తామని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
నిఖిల్, అనుపమ పరమేశ్వర్ జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ‘18 పేజెస్’ అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను కూడా లాంచ్ చేశారు.. చూసే ఉంటారు. ఈ సినిమా పరిస్థితి కూడా ఓటీటీవైపే వెళ్లేలా ఉంది. ఇంకా ఈ సినిమా పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అది పూర్తి చేసి కొన్నాళ్లు ఆగుతారట. అప్పటికీ అంటే ఆగస్టు, సెప్టెంబరు నాటికి కరోనా పరిస్థితులు సద్దుమణగకపోతే ఓటీటీకి ఇచ్చేస్తారట. అయితే ఇవి ఆహాకి వెళ్తాయో, లేక ఇతర ఓటీటీలతో బేరాలు జరుగుతాయా అనేది చూడాలి.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!