అక్కినేని ప్రిన్స్ హలో అంటూ హిట్ ని సొంతం చేసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యువతకి బాగా నచ్చింది. దీంతో ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయేది ఈ డైరక్టర్ తోనే అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై అఖిల్ స్పందించారు. తన తర్వాతి సినిమా కొరటాల శివ, సుకుమార్, వంశీ పైడిపల్లి లతో ఉండబోదని స్పష్టం చేశారు. “నేను ఎవరిని కలిస్తే వారితో సినిమాలు చేస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివతో కలిసి లంచ్ చేశాను. మాట్లాడుకున్నాం. కానీ, సినిమా ఫైనల్ కాలేదు. వంశీని కూడా కలిశాను. ఆయనతోనూ ప్రాజెక్టు సెట్ కాలేదు.
అలాగే సుకుమార్‌తోనూ మాట్లాడాను. అయితే ఇప్పట్లోనే ఆయనతో సినిమా ఉండదు. జనవరి ఐదున ఓ కథ వింటున్నాను. అలాగే జనవరి 8న ఓ స్టోరీలైన్ వినబోతున్నాను. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి జనవరి 10న ప్రకటిస్తాను” అని అఖిల్ చెప్పాడు. ఈ సినిమా కూడా నాగార్జున నిర్మిస్తారా? లేకుంటే ఇతరుల బ్యానర్లో సినిమా ఉంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖిల్ ఈ సారి కొత్త డైరక్టర్ తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ మరో పది రోజుల్లో సమాధానం దొరకనుంది.