ఈ వార్తలన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయండీ బాబు: ఆఖిల్

  • May 6, 2016 / 06:38 AM IST

అక్కినేని అఖిల్ తన రెండో చిత్రంపై పలు వెబ్ సైట్ లలో వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశాడు. అఖిల్ రెండో చిత్రం మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నిర్మించనున్నారని..అయితే భారీ బడ్జెట్ కారణంగా వారు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని పలు వెబ్ సైట్ లలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అఖిల్ ఈ వార్తలపై స్పందించాడు. ‘మీరు ఇటువంటి సమాచారం ఎక్కడనుంచి పొందుతారో తెలియదు.

నా రెండో చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మించనున్నారన్నది అవాస్తవం. ఈ వార్తలో నిజం లేదు. వార్తలు రాసే ముందు ఒక్కసారి కనుక్కొని రాస్తే బాగుంటుంద’ని  అఖిల్ తన ట్విటర్ అక్కౌంట్ లో పేర్కొన్నాడు. కాగా అఖిల్ రెండో చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus