అఖిల్ డైరక్టర్ మారాడు

అక్కినేని ప్రిన్స్ అఖిల్ రెండో సినిమాను దర్శకత్వం చేసే డైరక్టర్ మారాడు. అందాల రాక్షసి చిత్రాన్ని తీసిన హను రాఘవ పూడి తో సినిమా చేయనున్నట్లు అఖిల్ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కింగ్ నాగార్జున తాజాగా తన కొడుకుల చిత్రాలను డైరక్ట్ చేసే వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు. తన కుటుంబానికి అపురూపమైన “మనం” చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ తో అఖిల్ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
“సెప్టెంబర్ నెల రాకింగ్ అనే చెప్పాలి. నేను పనిచేసిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాను. కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య, విక్రమ్ కుమార్ తో అఖిల్ సినిమా వుంటాయి. త్వరలోనే ఇవి సెట్స్ పైకి వెళతాయి” అని పోస్ట్ చేశారు. వీటిని నాగార్జున సొంత చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించనుంది. “నా ఫెవరెట్ డైరక్టర్ విక్రమ్ కుమార్ తో సినిమా అనౌన్స్ చేయడం చాలా థ్రిల్ గా ఉంది” అని అఖిల్ కూడా ట్వీట్ చేసాడు. అతని మొదటి సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో రెండో చిత్రం పై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి ల కథలకు మొదట ఓకే చెప్పినా చివరికి విక్రమ్ కుమార్ నే ఎంచుకున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus