బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో టాస్క్ లో లొల్లి స్టార్ట్ అయ్యింది. ఇంటి సభ్యులలో సీనియర్స్ అయిన వారియర్స్ స్మగ్లర్స్ గా, జూనియర్స్ అయిన ఛాలెంజర్స్ పోలీసులుగా మారారు. ఇక్కడే టాస్క్ లో రెచ్చిపోయి మరీ అర్గ్యూమెంట్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ నుంచీ ఛాలెంజర్స్ కి సపోర్టింగ్ గా ఉన్న చైతూ సీనియర్స్ తో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశాడు. చెక్ పోస్ట్ దగ్గర స్ట్రిక్ట్ గా ఉంటూ సీనియర్స్ ని స్మగ్లింగ్ చేయకుండా ఆపడంలో కీలకమైన పాత్ర పోషించాడు.
అంతేకాదు, సీనియర్స్ ఎప్పుడు లాజికల్ గా మాట్లాడినా బిందుమాధవి కడిగిపారేస్తోంది. అందరికీ లెఫ్ట్ రైట్ క్లాస్ పీకుతోంది. ఈ టైమ్ లో నటరాజ్ మాస్టర్ మాట్లాడిన మాటలకి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది బిందుమాధవి. ఇక లంచ్ టైమ్ లో బిందుమాధవి ఫుడ్ తినే టైమ్ లో అఖిల్ స్మగ్లర్స్ వండిన ఫుడ్ ని ఎందుకు తింటున్నారు అంటూ కామెంట్ విసిరాడు. దీంతో బిందుమాధవి ప్లేట్ అక్కడ పారేసి తినకుండా వెళ్లిపోయింది. అక్కడ్నుంచీ హౌస్ వేడెక్కిపోయింది.
మెల్లగా బిందుకి ఏమైంది అని అడుగుతూ ఛాలెంజర్స్ అందరూ బిందు దగ్గరకి వచ్చారు. అంతేకాదు, పక్కనే ఉండే యాంకర్ శివ కూడా అలా ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించాడు. ఈ సీన్ తర్వాత అఖిల్ ఒంటరిగా కూర్చుని బాధపడ్డాడు. ఎమోషనల్ అవుతూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత అఖిల్ సిట్యువేషన్ లో అనిల్ తో మాట్లాడిన మాటలు వేరని దానికి ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలియదని కెప్టెన్ తేజుతో చెప్పాడు.
నేను స్మగ్లర్స్ బాసిన్లు తోమాలి అని అనిల్ అంటే, బ్రదర్ మీరు ఇప్పుడు స్మగ్లర్స్ పెట్టిన ఫుడ్డే తింటున్నారు అన్నానని, అంతకుమించి ఏం మాట్లాడలేదని చెప్పాడు అఖిల్. బెడ్ రూమ్ లో కూర్చుని బిందుమాధవి అసలు వారియర్స్ తో మాట్లాడకుండా ఉంటే బాగుండు అని అభిప్రాయపడింది. ఇంత జరిగినా కూడా కెప్టెన్ తేజస్వి అస్సలు పట్టించుకోలేదు. దీంతో చైతూ, శివ, ఇంకా స్రవతం, రాపాక వీళ్లు బిందు మాధవి చుట్టూ చేరి అసలు ఏం జరిగిందో తెలుకునే ప్రయత్నం చేశాడు.
నిజానికి స్రవంతి అఖిల్ ఫ్రెండ్ కాబట్టి, బిందుమాధవి ఏం మాట్లాడింది అనేది ఖచ్చితంగా అకిల్ కి చెప్తుంది. అప్పుడు అఖిల్ కి బిందుమాధవికి గట్టిగా వార్ జరిగే అవకాశమే కనిపిస్తుంది. మెల్లగా బిందుమాధవి తన సైన్యాన్ని హౌస్ లో పెంచుకుంటూ వెళ్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ గేమ్ ని ఎనలైజ్ చేస్తోంది. సిట్యువేషన్ కి తగ్గట్లుగా మాట్లాడుతూ గేమ్ లో తనదైన స్టైల్ చూపిస్తోంది బిందు.