అన్నయ్య రిలేషన్ షిప్స్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి: అఖిల్

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. నాని కి ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పెళ్ళైన తరువాత మొదటిసారి తన భార్య సమంతతో కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన లభించింది. సమ్మర్ కానుకగా త్వరలో విడుదల కాబోతుంది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… నాగ చైతన్య తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ… ‘రిలేషన్ షిప్స్ పై మీకేమైనా క్రేజీ డౌట్స్ లేదా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి’ అంటూ తనతో పాటు తన భార్య సమంతని కూడా ట్యాగ్ చేసి ట్వీట్ చేసాడు. దేనికి ‘ఆస్క్ చైసామ్’ అనే హాష్ ట్యాగ్ ను కూడా జతచేసాడు. దీనికి తన తమ్ముడైన అఖిల్ స్పందిస్తూ… ‘అన్నయ్యా… రిలేషన్ షిప్స్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి… నేను మిమ్మల్ని అడగొచ్చా’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా… కొందరు ట్రోలర్స్ మాత్రం రెడీ గా ఉంటారు కదా.గతంలో అఖిల్ కు శ్రీయ భోపాల్ తో నిశ్చితార్థం అయిన సంగతి తెలిసందే. నిజానికి చైసామ్ కంటే ముందే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఏమైందో… ఏమో అఖిల్- శ్రీయ ల నిశ్చితార్థం… పెళ్ళి వరకూ వెళ్ళలేదు. అఖిల్ కి నిజంగా రేలషన్ షిప్స్ గురించి తెలీదు… చైతూ గారూ, సమంత గారూ… కొంచెం అఖిల్ గారికి రేలషన్ షిప్స్ గురించి సలహాలివ్వండి అంటూ కొందరు కామెంట్లు పెట్టడం వైరల్ గా మారింది. ఇక మరో వైపు మన భల్లాల దేవుడు రానా కూడా ‘నన్ను కూడా అడగమంటారా’ అంటూ నవ్వుతూ ఉన్న స్మైలీస్ పెట్టి కామెంట్ పెట్టగా.. ‘అడగొచ్చు బ్రో’ అంటూ చైతన్య సమాధానమిచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus