Agent: ఏజెంట్ మూవీ వైల్డ్ పోస్టర్‌ విడుదల సందర్భంగా విన్యాసం చేసిన అఖిల్!

కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్‌తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్‌లో అఖిల్ అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమాని యమా జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన కంటెంట్.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. ఇప్పుడు ‘ఏజెంట్’ ట్రైలర్ విడుదలకు మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 18న కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్‌‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అఖిల్ అక్కినేని వైల్డ్ పోస్టర్‌ని విడుదల చేశారు.

ఆదివారం విజయవాడ లో ఈ వైల్డ్ పోస్టర్‌ ని క్రేజీగా లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. అఖిల్ అక్కినేని పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్‌లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. వైల్డ్ పోస్టర్ పోస్టర్ విషయానికి వస్తే.. అఖిల్ లుక్ మెస్మరైజ్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్‌తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్‌లో కనిపించడం వైల్డ్‌గా వుంది. ట్రైలర్‌ని ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో తెలిపారు.

వైల్డ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ట్రైలర్ డేట్, టైం లాంచ్ ఇంత వైల్డ్‌గా చేశామంటే.. ట్రైలర్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందో ఊహించుకోండి. 18న ట్రైలర్ లాంచ్. అందరం కాకినాడలో కలుద్దామని అన్నారు. కాగా ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా ఏకకాలంలో విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus